: పాక్ ఎత్తును చిత్తు చేసిన రాజ్ నాథ్!
పాకిస్థాన్ విందు పేరిట వేసిన ఎత్తును కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చిత్తు చేశారు. ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోం మంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్ ను విందుకు పిలిచి అవమానించాలని పాక్ ఎత్తు వేసింది. సార్క్ సదస్సులో ప్రధాన కార్యక్రమం ముగియగానే రాజ్ నాథ్ కు పాక్ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ విందు ఏర్పాటు చేశారు. అయితే, సదస్సులో ప్రధాన కార్యక్రమం ముగియగానే విందుకు హాజరు కాకుండా నిసార్ అలీ ఖాన్ మాయమయ్యారు. అయితే, ఈ విషయం రాజ్ నాథ్ కు తెలుసో తెలియదో గానీ, ఆయన కూడా ఈ విందుకు వెళ్లలేదు. రాజ్ నాథ్ బస చేసిన హోటల్లోనే భోజనం చేసి భారత్ కు తిరిగి పయనమయ్యారు.