: ‘రియో’ చేరిన సచిన్ టెండూల్కర్


రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత జట్టు గుడ్ విల్ అంబాసిడర్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రెజిల్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా భారత ఒలింపిక్ జట్టుకు సచిన్ అభినందనలు తెలిపాడు. ఈ విషయాన్ని సచిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. తాను ‘రియో’కు వెళ్లడంపై సరికొత్త అనుభూతికి లోనయ్యానని, భారత జట్టు మెరుగైన ప్రదర్శనతో రాణించాలని ఆ ట్వీట్ లో ఆకాంక్షించాడు. కాగా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆహ్వానం మేరకు సచిన్ అక్కడికి వెళ్లారు. క్రికెట్ లెజెండ్ సచిన్ కు ఒలింపిక్స్ ఆహ్వానం అందడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News