: పాక్ దుర్నీతి గురించి ముందుగా ప్రధానికే వివరించాలని రాజ్‌నాథ్‌సింగ్ నిర్ణయం?


సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశంలో పాల్గొన‌డానికి పాకిస్థాన్‌కు వెళ్లిన‌ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తిరిగి భార‌త్‌కు చేరుకున్నారు. స‌మావేశంలో ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చే దేశాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న చేస్తోన్న ప్ర‌సంగాన్ని ఆ దేశ‌ మీడియా బ‌హిష్క‌రించిన విష‌యం తెలిసిందే. అక్క‌డికి వెళ్లిన భారత మీడియాను కూడా అడ్డుకొని ఆయ‌న ప్ర‌సంగాన్ని ప్రత్యక్ష ప్రసారం కాకుండా చేసింది. ఈ విషయంపై ఢిల్లీ విమానాశ్ర‌యానికి చేరుకోగానే మీడియా స‌మావేశం నిర్వ‌హించాల‌నుకున్న రాజ్‌నాథ్ సింగ్ త‌న అభిప్రాయాన్ని మార్చుకున్నారు. భార‌త్‌కు చేరుకోగానే ఆయన మీడియాతో మాట్లాడలేదు. ప్ర‌ధాని మోదీతోనే పాకిస్థాన్ చేసిన హంగామాపై మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు స‌మాచారం. పాక్ దుర్నీతిపై ప్ర‌ధానితో చ‌ర్చించాక రాజ్‌నాథ్‌సింగ్‌ పార్లమెంట్‌లో సార్క్ స‌మావేశంలో జ‌రిగిన ఘ‌ట‌న గురించి మాట్లాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News