: బంజారాహిల్స్‌లో నిరాహార దీక్షకు దిగిన 30 మంది విద్యార్థుల అరెస్ట్... ఉద్రిక్తత
పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం సరిపోవడం లేదని, పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలంటూ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ స్టడీసర్కిల్ వద్ద నిరాహారదీక్షకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కొందరు విద్యార్థులు గదుల్లోకెళ్లి తలుపులు పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తం 30 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులకి, విద్యార్థులకి మధ్య వాగ్వివాదం చెలరేగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.