: హాలీవుడ్ టీవీ నటి క్రిస్ జెన్నర్ కు తప్పిన ప్రమాదం


హాలీవుడ్ టీవీ రియాలిటీ స్టార్ క్రిస్ జెన్నర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజిల్స్ లోని మాలిబ్ బీచ్ రోడ్డులో నిన్న మధ్యాహ్నం తన రోల్స్ రాయిస్ కారులో వెళుతున్న క్రిస్ మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికుల సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బయటపడిందని క్రిస్ జెన్నర్ చిన్న కుమార్తె కైలీ జెన్నర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా, క్రిస్ జెన్నర్ ఢీ కొట్టిన వాహనం, డ్రైవర్ పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయం తెలియదు. కాగా, ‘కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్స్’ అనే హిట్ షో ద్వారా అరవై ఏళ్ల క్రిస్ జెన్నర్ మంచి పాప్యులారిటి సంపాదించింది.

  • Loading...

More Telugu News