: సార్క్ దేశాల సాక్షిగా దుర్నీతిని చాటుకున్న పాకిస్థాన్!


దక్షిణాసియా దేశాల హోం మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల సాక్షిగా, పాకిస్థాన్ తన దుర్నీతిని చాటుకుంది. ఈ సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన భారత మీడియాను రాజ్ నాథ్ ప్రసంగం మొదలయ్యే సమయానికి నిర్దయగా బయటకు పంపించి వేసింది. భారత హోం మంత్రి ఏం మాట్లాడారన్నది ప్రత్యక్ష ప్రసారం చేయకుండా లైవ్ వ్యాన్లను అడ్డుకుంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనూ అక్కడున్న కొందరు పాక్ మీడియా ప్రతినిధులు నినాదాలు చేస్తుంటే, ఏ అధికారీ అడ్డుకోలేదని తెలుస్తోంది. ఉగ్రవాదులను అమర వీరులుగా కీర్తించడాన్ని మానుకోవాలని రాజ్ నాథ్ చెబుతుండగా, గట్టిగా నినాదాలు వినిపించినట్టు విదేశీ మీడియా వెల్లడించింది.

  • Loading...

More Telugu News