: ఇంగ్లాండులోనూ తప్పని లైంగిక వేధింపులు


అభివృద్ధి చెందిన దేశం ఇంగ్లాండ్ లోనూ లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇటీవలి కాలంలో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరుగుతుండటంతో ఒక క్రైమ్ సర్వే నిర్వహించారు. ఇంగ్లాండ్, వేల్స్ లలో నిర్వహించిన ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. స్త్రీలు, పురుషులు తమ బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు ఈ సర్వే వెల్లడించింది. 16 నుంచి 59 సంవత్సరాల వయసున్న స్త్రీ, పురుషులు తమ చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిసింది. 5,67,000 మంది స్త్రీలు, 1,02,000 మంది పురుషులు తమ బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు సర్వే వెల్లడించింది. అదే, శాతాల వారీగా చూస్తే 11 శాతం మహిళలు, 3 శాతం పురుషులు లైంగిక వేధింపుల బారినపడ్డారు.

  • Loading...

More Telugu News