: ఇక అమితాబ్ మనవరాలి వంతు.. నవ్య నవేలి నందాతో చనువుగా శిఖర్ పహారియా


అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవికి ముద్దులు పెడుతూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలితో కూడా జత కట్టిన ఫొటోలను తాజాగా పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అమితాబ్ మనవరాలు నవ్య నవేలి నందాతో శిఖర్ చనువుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా, శ్రీదేవి కుమార్తె జాహ్నవి తో లిప్ లాక్ చేసిన ఫొటోతో వార్తల్లో కెక్కిన శిఖర్ తాజాగా బిగ్ బీ మనవరాలితో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి అందరినీ ఆకర్షించేందుకు యత్నిస్తున్నాడని నెటిజన్ల సమాచారం.

  • Loading...

More Telugu News