: 123 జీవో ప్రకారం తీసుకున్న భూములను వెనక్కి ఇవ్వాలి: భ‌ట్టీవిక్ర‌మార్క‌


తెలంగాణ ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక విధానాల‌ను విడ‌నాడాల‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మ‌ల్లు భట్టీవిక్ర‌మార్క అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప‌రిపాల‌న‌పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి అవ‌గాహ‌న లేద‌ని, హైకోర్టు నిన్న 123 జీవోను ర‌ద్దు చేయ‌డ‌మే దానికి నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్యానించారు. 123 జీవో ప్రకారం ప్ర‌భుత్వం తీసుకున్న భూములను వెనక్కి ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూసేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టిక‌యినా త‌మ తీరుని మార్చుకోవాల‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News