: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా విడుదల


వచ్చే ఏడాది పంజాబ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. సామాజిక సేవల్లో ఉన్నవారికే ఆప్ సీట్లు కేటాయించింది. 19 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను ఆప్ విడుదల చేసింది. ఈ జాబితాలో సిక్కుల హక్కుల పోరాట యోధుడు ఒకరు, మరొకరు అర్జున అవార్డు గ్రహీత, ఇంకొకరు బీఎస్పీ మాజీ ఎంపీ, వేరొకరు పదవీ విరమణ పొందిన బ్రిగేడియర్ హోదాలో ఉన్న వ్యక్తి సహా సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న వైద్యుడు తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News