: మళ్ళీ గళం విప్పిన శంకర్రావు
గత కొంతకాలంగా మౌనం దాల్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు మళ్ళీ గళం విప్పారు. ఈయన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడే అయినా, విపక్షాలతో పాటు స్వపక్షీయులనూ టార్గెట్ చేస్తారు. కొన్నిసార్లు హైకమాండ్ ను విమర్శించేందుకూ వెనుకాడరు. అయితే, ఇటీవలే గ్రీన్ ఫీల్డ్స్ భూముల వివాదంలో చిక్కుకున్న శంకర్రావు ప్రస్తుతం సీఐడీ విచారణ ఎదుర్కొంటున్నారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజుల క్రితమే బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం మౌనంగా ఉన్న శంకర్రావు మళ్ళీ నోరు విప్పారు.
ఈసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు సీఎం తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ ఆరోపణలకు దిగారు. అవినీతి మంత్రులకు కొమ్ముకాస్తున్న ముఖ్యమంత్రి.. అవినీతిపై పోరాటం చేస్తున్న తనపై అక్రమ కేసులు బనాయించి మంత్రి వర్గం నుంచి తొలగించారని వ్యాఖ్యానించారు.