: నాలోని నటుడ్ని గుర్తించిన అర్షద్ తో కలిసి మళ్లీ నటించడం ఆనందంగా ఉంది: బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ
‘మున్నాభాయ్ ఎంబిబియస్’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు బొమన్ ఇరానీ తాజా చిత్రం ‘ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇరానీ మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నానని, బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కొరియో గ్రాఫ్ చేసిన నాటకంలో నటించానని చెప్పాడు. అర్షద్ ప్రోత్సాహంతోనే తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పాడు. ఇప్పటివరకు తాను నాలుగు చిత్రాల్లో నటించానని, రేపు విడుదల కానున్న చిత్రం తనకు ఐదోదని చెప్పిన ఇరానీ, తనలో నటుడిని గుర్తించిన అర్షద్ కు కృతఙ్ఞతలు చెప్పాడు. మళ్లీ అర్షద్ తో కలిసి నటించడం తన కెంతో ఆనందంగా ఉందని ఇరానీ చెప్పాడు.