: సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఒలింపిక్స్ కు వెళ్లి ఉండేదాన్ని: దీపికా పదుకునే
సినిమాల్లోకి రాకపోయి ఉంటే రియో ఒలింపిక్స్ లో పాల్గొని ఉండేదానినేమోనని బాలీవుడ్ నటి దీపికా పదుకునే తెలిపింది. ప్రైవేటు కార్యక్రమం కోసం హైదరాబాదు వచ్చిన సందర్భంగా దీపికా పదుకునే మాట్లాడుతూ, సినీ రంగంలో ఆస్కార్ అవార్డు ఎంత గొప్పదో క్రీడా రంగంలో ఒలింపిక్స్ లో పతకం సాధించడం కూడా అంతే గొప్ప విషయమని తెలిపింది. రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత క్రీడాకారులంతా పతకాలు సాధించాలని దీపిక ఆకాంక్షించింది. రియోలో పాల్గొననున్న క్రీడాకారులందరికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. తానూ చిన్నప్పటి నుంచి టీనేజ్ వరకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణినని చెప్పిన దీపిక, జాతీయస్థాయిలో కూడా ఆడానని తెలిపింది. ఆట చాలా సంతృప్తినిస్తుందని చెప్పింది. స్పోర్ట్స్ లో కొనసాగి ఉంటే రియో ఒలింపిక్స్ లో పాల్గొని ఉండే దానినని దీపిక చెప్పింది. ఆరో తరగతిలో ఉండగా హైదరాబాద్ తొలిసారి వచ్చానని, అప్పుడే మొదటిసారి చార్మినార్ ను చూశాని దీపికా పదుకునే గుర్తు చేసుకుంది. తరువాత ఎప్పుడనుకుంటే అప్పుడు హైదరాబాదు వస్తూనే ఉన్నానని, హైదరాబాదు తనకు హోం టౌన్ లాంటిదని, హైదరాబాదు చారిత్రక కట్టడాలతో ఆకట్టుకునే అందమైన నగరమని కితాబునిచ్చింది. శంషాబాదు విమానాశ్రయం బాగుందని తెలిపింది.