: ఐఎస్ఐఎస్ లిస్టులో మూడో దేశం ఆస్ట్రేలియా


ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ముప్పు కలిగిన దేశాల లిస్టులో ఆస్ట్రేలియా మూడోనెంబర్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ టార్గెట్ లో అమెరికా, ఫ్రాన్స్ తరువాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉందని అమెరికా కంగ్రెషనల్ కమిటీ ఇచ్చిన నివేదికలో వెలుగుచూసింది. ఐఎస్ కుట్రలతో ఉన్న సంబంధాలను బట్టి వివిధ దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వగా, ఆ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. 2014 నుంచి జరిగిన 101 ఉగ్రవాద దాడులను విశ్లేషించి ఈ నివేదికను సమర్పించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. కాగా, ఈ నివేదికపై అడిలైడ్ లో జస్టిస్ మినిస్టర్ మిఖాయిల్ కీనన్ మాట్లాడుతూ, ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలేమీ లేవని అన్నారు. ఐసిస్ లిస్టులో ఆస్ట్రేలియా ఉందని, దాని నుంచి తమకు సవాళ్లు ఎదురవుతాయని తమకు ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు. తమ దేశంలో ప్రజల జీవనశైలిని ద్వేషించడమే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమను లక్ష్యంగా చేసుకోవడానికి కారణమని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా అన్నివిధాలా సిద్ధంగా ఉందని, తమను మించి మరేదేశమూ ఉగ్రవాదంపై పోరుకి సిద్ధంగా లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News