: చంద్రబాబు, లోకేష్ కు సవాల్ విసిరిన ముద్రగడ


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఆమరణ నిరాహార దీక్షకు దిగగలరా? అని కాపు రిజర్వేషన్ ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం సవాలు విసిరారు. వారిద్దరూ ఆమరణ నిరాహారా దీక్ష చేపడితే తాను కూడా వారితో కలిసి దీక్షలో కూర్చుంటానని ఆయన రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ సవాలు స్వీకరించడం ద్వారా చంద్రబాబు రెండు విషయాలపై ఉన్న అనుమానాలు తొలగించిన వారవుతారని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై చంద్రబాబు చిత్తశుద్ధి, తామిద్దర్లో ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలరో నిరూపించడం ద్వారా పటుత్వం, పట్టుదల, లక్ష్య సాధనలో చిత్తశుద్ధి కూడా తెలిసిపోతాయని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ కోసం తాను చేపట్టిన దీక్షపై తన అనుచరులతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని ఆయన ఆరోపించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఆర్థికంగా, సామాజికంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కాపు జాతి శ్రేయస్సు కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News