: పర్యవసానాన్ని బీజేపీ అనుభవించే తీరుతుంది: బాలకృష్ణ నిప్పులు


ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుంటే అందుకు జరిగే పర్యవసానాన్ని బీజేపీ అనుభవించి తీరుతుందని హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, "మనవాళ్లంతా ధర్నాలు చేస్తున్నారు. హోదా ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం జరిగింది. మేము దానికే కట్టుబడి వున్నాము. మరి వాళ్లిచ్చిన మాటే. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఘంటాపథంగా బద్దలు కొట్టి మరీ... హోదా గురించి బెంచీల మీద గుద్ది మరీ చెప్పారు. దానికి తప్పకుండా కట్టుబడే ఉండాలి. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అంతవరకూ రాదనే అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇవాళ ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి... ఇవాళ అనాథ రాష్ట్రం మనది. అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు. అందుకు కట్టుబడి ఉండాలని మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాను కూడా. లేకుంటే పర్యవసానాలను అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలి" అన్నారు.

  • Loading...

More Telugu News