: నదిలో మునిగిన బస్సులో డ్రైవర్ తనయుడు కూడా వున్నాడు!


ముంబై, గోవా హైవేపై సావిత్రీ నదిపై వంతెన కూలిన ఘటనలో రెండు బస్సులు, నాలుగు కార్లు కొట్టుకుపోయిన ఉదంతంలో, ఓ బస్సు డ్రైవర్ తో పాటు ఆయన కుమారుడు కూడా బస్సులోనే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. శ్రీకాంత్ కాంబ్లే అనే బస్సు డ్రైవర్, తన కుమారుడిని ముంబైలోని కాలేజీ అడ్మిషన్ ఇంటర్వ్యూ వున్నందున అతన్ని కూడా తన వెంట తీసుకు వెళ్లేందుకు అనుమతించాలని అధికారులను అనుమతి కోరాడని తెలుస్తోంది. అధికారులు అనుమతించగా, తన 17 సంవత్సరాల కొడుకు మహేంద్రను బస్సులో తీసుకు వెళ్లాడని శ్రీకాంత్ చిన్న కుమారుడు మిలింద్ వెల్లడించారు. ఇంటికి పెద్ద దిక్కుతో పాటు ఆసరాగా నిలవాల్సిన పెద్ద కుమారుడు కూడా ఈ ఘటనలో గల్లంతు కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

  • Loading...

More Telugu News