: పాక్ గడ్డపై రాజ్ నాథ్ ఉన్న వేళ... హఫీజ్ సయీద్ బ్యాచ్ తీవ్ర నిరసనలు


భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సార్క్ సమావేశాల నిమిత్తం పాకిస్థాన్ లో పర్యటిస్తున్న వేళ, లష్కరే తోయిబా ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. లాహోర్ లోని నిరసనల్లో హఫీజ్ స్వయంగా పాల్గొనగా, జేకేఎల్ఎఫ్ (జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్) నేత యాసిన్ మాలిక్ భార్య ఇస్లామాబాద్ లో నిరాహార దీక్షకు దిగారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన సయ్యద్ సలాహుద్దీన్, రాజ్ నాథ్ కు స్వాగతం పలకడంపై మండిపడ్డాడు. కాగా, నిన్న బీఎస్ఎఫ్ విమానంలో పాక్ చేరుకున్న రాజ్ నాథ్ అక్కడి నుంచి హెలికాప్టర్ లో తాను బస చేయాల్సిన హోటల్ కు వెళ్లిపోయారు. కాగా, రాజ్ నాథ్ సింగ్ ఎటువంటి ద్వైపాక్షిక సమావేశాలనూ నిర్వహించబోవడం లేదని, పాక్ హోం మంత్రి చౌదరి నిస్సార్ అలీ ఖాన్ తో విడిగా చర్చలు ఉండవని భారత అధికారులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News