: వెలగపూడిలో నారాయణ శాఖ ప్రారంభం!... శిద్ధా శాఖ కూడా!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని తాత్కాలిక సచివాలయానికి ఏపీ ప్రభుత్వ శాఖల తరలింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే సిద్ధమైన తాత్కలిక సచివాలయంలోకి పలు శాఖలు చేరిపోయాయి. తాజాగా మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వం వహిస్తున్న పురపాలక శాఖ కూడా కొద్దిసేపటి క్రితం అక్కడ కొలువుదీరింది. తాత్కాలిక సచివాలయంలోని రెండో బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్ లో మునిసిపల్ శాఖను కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ ప్రారంభించారు. ఇకపై పురపాలక శాఖ కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతాయని ఈ సందర్భంగా నారాయణ ప్రకటించారు. ఇదిలా ఉంటే... పలుమార్లు వాయిదా పడ్డ రవాణా శాఖ కార్యాలయం కూడా తాత్కాలిక సచివాలయంలో ప్రారంభమైంది. ఐదో బ్లాకులోని మొదటి అంతస్తులో ఈ కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు.