: హోంవర్క్ చేయలేదని రెండో తరగతి బాలికపై బెంగళూరు ట్యూషన్ టీచర్ ప్రతాపం!... బెల్టుతో బాదిన వైనం!


బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. అప్పుడప్పుడే విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న ఓ చిన్నారి బాలికపై ట్యూషన్ టీచర్ తన ప్రతాపాన్ని చూపాడు. చిన్న పొరపాటుకు నడుముకున్న బెల్టు తీసి ఆ చిన్నారిని బాదేశాడు. వివరాల్లోకెళితే... బెంగళూరుకు చెందిన భావన అనే ఏడేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. పాఠశాలలో చెప్పిన పాఠాలపై బాలికకు మరింత అవగాహన రావాలన్న భావనతో తల్లిండ్రులు భావనను ఇంటివద్ద ట్యూషన్ కు కూడా పంపిస్తున్నారు. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్ నేటి ఉదయం ఆ బాలికపై బెల్టు తీసి ప్రతాపం చూపాడు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో బాలికను చితకబాదాడు. దీంతో బాలిక శరీరంపై వాతలు తేలాయి. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News