: మాదాపూర్ లో సందడి చేసిన రెజీనా


హైదరాబాదులోని మాదాపూర్ లో సినీ నటి రెజీనా కాసాండ్రా సందడి చేసింది. ఒప్పో మొబైల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రెజీనా మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్‌ లో ఎఫ్-1 ఫోర్ట్ మొబైల్స్ షోరూంను ప్రారంభించింది. ఈ ఎఫ్-1 ఫోర్ట్ మొబైల్ ను ఒప్పో సంస్థ ఆత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో రూపొందించినట్టు రెజీనా తెలిపింది. 32 జీబీ ర్యామ్ ట్రిపుల్ ప్లాట్ కార్ట్ లాంటి సదుపాయాలు ఈ మొబైల్‌ లో ఉన్నాయని, మంచి క్లారిటీతో కూడిన బ్లూరే వీడియోలు ఈ మొబైల్స్ లో అద్భుతంగా ప్లే అవుతాయని రెజీనా చెప్పింది. రెజీనా వచ్చిందని తెలియగానే ఆ ప్రాంతానికి ఆమె అభిమానులు భారీసంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో సెల్ఫీలు దిగి రెజీనా సందడి చేసింది.

  • Loading...

More Telugu News