: హృదయ విదారకం... 100 కిలోమీటర్లు కొట్టుకుపోయిన మృతదేహాలు!


ముంబై నుంచి గోవా వెళ్లే రహదారిపై వంతెన కూలి వాహనాలు గల్లంతైన ఘటనలో ఎంత మంది మరణించారన్న విషయమై ఇప్పటివరకూ కనీస అంచనాలు కూడా వెలువడక పోగా, మొత్తం నాలుగు మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఘటన జరిగిన మహద్ ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలోని అరేబియా సముద్ర తీరం వద్ద బస్సు డ్రైవర్ మృతదేహం లభ్యమైంది. బ్రిడ్జి కూలిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు చిక్కుకున్న మహిళ మృతదేహాన్ని సెర్చ్ జరుపుతున్న సిబ్బంది గుర్తించారు. నదిలో ప్రవాహం తగ్గిన తరువాతనే బస్సు, ఇతర వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలుస్తుందని, ఆ వాహనాల్లోనే కొన్ని మృతదేహాలు ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన హృదయవిదారకమని, మృతదేహాల కోసం అరేబియా తీరంలో నది కలిసే చోట సోదాలను ముమ్మరం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News