: తిరుమలలో ఈదురు గాలుల బీభత్సం!... కూలిన భారీ వృక్షం, భక్తుడికి తీవ్ర గాయాలు
వెంకన్న సన్నిధి తిరుమలలో నేటి ఉదయం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల కొండపై భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నేటి ఉదయం ఈదురు గాలులు ప్రతాపం చూపాయి. భారీ వేగంతో వీచిన ఈదురు గాలుల కారణంగా ఉచిత సముదాయం వద్ద ఓ భారీ వృక్షం నేలకూలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మహారాష్ట్రకు చెందిన బాలాజీ అనే భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని వెనువెంటనే తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.