: యూపీలో చీకటి దందా!... రూ.50లకే రేప్ వీడియోలు దొరుకుతున్న వైనం!


అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న ఉత్తరప్రదేశ్ లో మరో చీకటి దందా వెలుగుచూసింది. అసహాయులైన మహిళలు, బాలికలపై విరుచుకుపడుతున్న మృగాళ్లు... తాము పాల్పడుతున్న దుర్మార్గాలను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత సదరు వీడియోలను వారు నేరుగా మొబైల్ షాపులకు అందజేస్తున్నారు. వీటిని ఆ మొబైల్ షాపు యజమానులు విచ్చలవిడిగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా మొత్తం బహిరంగంగానే జరుగుతున్నా... పోలీసులు కాని, అధికార యంత్రాంగం కాని దీనిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వెరసి అత్యంత క్రూరమైన ఈ నేరాలకు సంబంధించిన వీడియోలు రోజూ వందలు, వేలల్లో విక్రయమైపోతున్నాయి. అది కూడా యూపీలోని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. యావత్తు రాష్ట్రం మొత్తంలో ఈ వ్యవహారం సాగుతోంది. రేప్ ఘటనలకు చెందిన ఈ వీడియోలను వాటి నిడివిని ఆధారం చేసుకుని రేటు నిర్ణయిస్తున్నారు. 30 సెకన్ల పాటు ఉండే వీడియోను రూ.50 కు విక్రయిస్తున్న దుర్మార్గులు... 5 నిమిషాల నిడివి ఉన్న వీడియోను కేవలం రూ.150 కు విక్రయిస్తున్నారు. ఈ దందాపై జాతీయ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News