: షారూఖ్ జట్టు ఆటగాడిపై సస్పెన్షన్ వేటు


వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న కరీబియన్ క్రికెట్ లీగ్ నుంచి షారూఖ్ భాగస్వామిగా ఉన్న ట్రిబాంగో నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ విలియమ్ పెర్కిన్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. థర్డ్ పార్టీతో చేతులు కలిపి, ప్లేయర్ కాంట్రాక్టు నిబంధనల్లో 10.1.1, 10.1.2 లను అతడు ఉల్లంఘించినట్టు నిర్ధారణ కావడంతో సీపీఎల్ సెక్యురిటీ టీమ్, ఐసీసీ అవినీతి వ్యతిరేక బృందం మేనేజర్ రిచర్డ్ రెనాల్డ్స్ సూచనల మేరకు అతనిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. దీంతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ మిగిలిన మ్యాచుల్లో అతడు ఆడకుండా ఆదేశాలు జారీ చేశారు. తనపై తీసుకున్న చర్యలను విలియమ్ పెర్కిన్స్ అంగీకరించాడు. సస్పెండ్ చేయడంతో తరువాత జరగనున్న ప్లేఆఫ్ మ్యాచ్ లకు దూరంగా ఉంటానని చెప్పాడు.

  • Loading...

More Telugu News