: మనం మన పనులు చేసేకోవాలె...విదేశీ పర్యటనలెందుకు?: మేయర్ ను నిలదీసిన సీఎం


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ విదేశీ పర్యటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైట్‌ టాపింగ్ రోడ్లు, జీహెచ్ఎంసీలోని వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశం ముగిసిన అనంతరం మన పనులు మనం చేసుకోవాలే కానీ విదేశాలకెందుకని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇక విదేశీ పర్యటనలు మానుకోవాలని ఆయన క్లాస్ పీకారు. ఈ మధ్య కాలంలో పురాతన బిల్డింగ్ లు కూలిపోవడం, వర్షాకాలం కావడంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం, నగర రోడ్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. కాగా, మేయర్ బొంతు రామ్మోహన్ రెండు నెలల క్రితం ఫ్రాన్స్, నాలుగు రోజుల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News