: భోజనానికి వెళ్తే... బెంజ్ కారు పోయింది!


సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన 'రుస్తుం' సినిమాను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కానీ... పూణేలో ఓ దొంగ అచ్చం ఆ సినిమాలోలా కారు దొంగిలించి దంపతులకు షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే... పూణేలోని బనేర్‌ రోడ్‌ లోని రియల్ ఎస్టేట్ ఫర్మ్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న ప్రీతమ్‌ రాజేశ్‌ కిన్రా (37) మనహట్టన్‌ సొసైటీలో నివాసముంటున్నారు. జులై 29న భార్యతో కలిసి రాజేష్ సేనాపతి బాపట్ రోడ్డులోని మారియట్‌ హోటల్‌ కి డిన్నర్ కి వెళ్లారు. రాత్రి 9:30 నిమిషాల సమయంలో వారు భోజనానికి వెళ్లారు. ఈ సమయంలో వాలెట్ పార్కింగ్ లో హోటల్ సిబ్బందికి కారు తాళాలు ఇచ్చి, భోజనం చేసేందుకు వెళ్లారు. ఈ డిన్నర్ కార్యక్రమం ఇంచుమించు అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం బయటకు వచ్చి చూడగా వారి బెంజ్‌ కారు కన్పించలేదు. దీంతో వాలెట్ పార్కింగ్ సిబ్బందిని నిలదీసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హోటల్‌ సీసీ టీవీ ఫుటేజి పరిశీలించగా 25 ఏళ్ల వ్యక్తి వాలెట్ పార్కింగ్ నుంచి కారు తీసుకుని వెళ్లడం కనిపించింది. అతను పార్కింగ్ నుంచి బయటకు తీసేందుకు హోటల్ సిబ్బంది సహాయం చేయడం విశేషం. కాగా, కారు వెళ్లిన దిశలో రోడ్డుపై సీసీ కెమెరాలున్నాయని చెప్పిన పోలీసులు, వాటి ఫుటేజి ఆధారంగా దొంగను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News