: నేడు నెల్లూరుకు వైఎస్ జగన్... ‘హోదా’ కోసం ‘యువ భేరీ’ మోగించనున్న విపక్ష నేత
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న నిరసనల్లో భాగంగా వైసీపీ నేడు నెల్లూరులో ‘యువ భేరీ’ పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో జగన్ ప్రత్యక్షంగా పాలుపంచుకుంటారు. ప్రత్యేక హోదాపై యువత, విద్యార్థులకు అవగహన కల్పించేందుకే వైసీపీ యువభేరీకి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా నెల్లూరులో నేడు జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్... రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంత అన్న విషయంపై కీలక ప్రసంగం చేయనున్నట్లు సమాచారం.