: బౌలర్లు రాణించారు...పిచ్ సహకరించలేదు...అద్భుతమైన టెస్టు మజా అందింది: కోహ్లీ


ఆంటిగ్వా వేదికగా జరిగిన రెండో టెస్టు క్రికెట్ మజాను పంచిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, రెండు జట్లు అద్భుతమైన ఆటతీరు కనబరిచాయని అన్నాడు. బౌలర్లు అద్భుతమైన బంతులు విసిరారని, అయితే పిచ్ నుంచి సరైన సహకారం అందలేదని కోహ్లీ పేర్కొన్నాడు. విండీస్ బ్యాట్స్ మన్ ఆకట్టుకున్నారని చెప్పాడు. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యామని తెలిపాడు. టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ క్రికెట్ మజాను పంచిందని కోహ్లీ తెలిపాడు. టాస్ ఓడడంతో మ్యాచ్ లో ఎలాగైనా గెలుస్తామని భావించానని కోహ్లీ చెప్పాడు. అయితే విండీస్ బ్యాట్స్ మన్ పుంజుకున్న విధానం అద్భుతమని కోహ్లీ ప్రశంసించాడు. కాగా, ఈ మ్యాచ్ లో అశ్విన్ కేవలం ఒకే ఒక వికెట్ కి పరిమితం కావడం విజయవకాశాలపై ప్రభావం చూపింది.

  • Loading...

More Telugu News