: విండీస్ ను కరుణించిన వరుణుడు...రెండో టెస్టు డ్రా


ఆంటిగ్వా వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారీ ఆధిక్యంతో దూసుకెళ్లడంతో ఈ టెస్టులో కూడా టీమిండియాదే విజయమని అంతా భావించారు. ఈ దశలో వరుణుడు అడ్డంపడి నాలుగోరోజు మ్యాచ్ ను అడ్డుకున్నాడు. నాలుగో రోజు కేవలం 15.5 ఓవర్ల మ్యాచ్ మాత్రమే జరగడంతో రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ కు మ్యాచ్ ను డ్రా చేసుకునే అవకాశం దక్కింది. ఆ దశలో విండీస్ బ్యాట్స్‌ మెన్‌ ఛేజ్‌ (137) అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. బౌలింగ్ లో ఐదు వికెట్లు తీసి సత్తాచాటిన ఈ విండీస్‌ ఆల్ రౌండర్ భారత్ కు మరో రికార్డు విజయాన్ని దూరం చేశాడు. దీంతో స్వదేశంలో సొంత జట్టుకు ఘోరపరాభవం కలుగకుండా అడ్డుకుని, జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. అతనికి విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌ (64), బ్లాక్‌ హుడ్‌ (63), డౌరిచ్‌ (74) అర్ధసెంచరీలతో సహకరించారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

  • Loading...

More Telugu News