: ముడిసరుకు తయారైనప్పటి నుంచి పన్ను పరిధిలోకి వస్తుంది: అరుణ్ జైట్లీ


ఒక వస్తువు తయారీకి ముడి సరుకు సిద్ధమైనప్పటి నుంచి అది పన్ను పరిధిలోకి వచ్చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఈరోజు రాజ్యసభలో జీఎస్ టీ బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ, వస్తువు తయారీకి ముడి సరుకు చేరిన తర్వాత అక్కడి నుంచి వస్తువులు ఎక్కడి దాకా వెళ్లాయన్నదాన్ని తెలుసుకోవడం ఈ బిల్లు వల్లే సాధ్యమవు తుందన్నారు. ముడిసరుకు నుంచి తయారీ, అమ్మకంలో ఎక్కడో ఒక చోట పన్ను పరిధిలోకి వస్తుందని జైట్లీ స్పష్టం చేశారు. సుమారుగా 17 నుంచి 18 శాతం వరకు జీఎస్ టీ ఉంటే ఉత్తమమని ముఖ్య ఆర్థిక సలహాదారు చెప్పారని, 18 శాతం పరిమితి అన్నది అన్నింటికీ వర్తించే అవకాశం ఉండదని జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News