: నిన్నటి బంద్ 'సక్సెస్'పై టీడీపీ వర్గాలు ఇలా అనుకుంటున్నాయట!


ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నిన్న ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ పై టీడీపీ వర్గాలు ఒక విషయాన్ని అదేపనిగా చెప్పుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ బంద్ లో వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఇదంతా తమ గొప్పతనమేనని కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, వామపక్షాలకు చెందిన వారు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. కానీ, ఈ బంద్ విజయవంతం కావడానికి కారణం తామేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బంద్ సక్సెస్ కావాలని చంద్రబాబు కోరుకున్నారని, అలా జరగడం వల్ల కేంద్రంలో తమకు కాస్త ప్రాధాన్యత పెరుగుతుందని భావించిన చంద్రబాబు, ఎవరినీ ముందస్తుగా అరెస్టులు చేయకుండా, వ్యూహాత్మకంగా వ్యవహరించారని, అందుకే ఈ బంద్ విజయవంతమైందని టీడీపీ వర్గాలు అనుకుంటున్నాయి. కాగా, ఈ బంద్ వల్ల ఆర్టీసీకి రూ.4 కోట్లు నష్టం వచ్చిందని, బంద్ ల పేరుతో ఏం సాధించారని వైఎస్సార్సీపీపై చంద్రబాబు నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ఉన్న కొత్త రాష్ట్రానికి ఇటువంటి బంద్ ల వల్ల నష్టమే తప్పా, లాభం లేదని బాబు వ్యాఖ్యానించడం విదితమే.

  • Loading...

More Telugu News