: మరో పది రోజుల్లో పెళ్లి... ఇప్పుడు కేన్సిల్ అన్న పెళ్లికొడుకు... పోలీసులకు ఫిర్యాదు చేసిన పెళ్లికుమార్తె


హైదరాబాదులోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో పెళ్లి కొడుకుపై పెళ్లి కుమార్తె ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... బోయిన్ పల్లికి చెందిన రంజిత్ అనే యువకుడు స్థానిక యువతిని వివాహం చేసుకునేందుకు అంగీకరించడంతో, రెండు కుటుంబాల పెద్దలు వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో మునిగిపోయారు. వివాహానికి మరో పది రోజులు మాత్రమే వుండగా, ఇప్పుడు రంజిత్ పెళ్లికుమార్తెకు ఫోన్ చేసి, ఆమెను వివాహం చేసుకోనని, తను ప్రేమించిన యువతిని వివాహం చేసుకుంటానని తెలిపాడు. దీంతో ఏర్పాట్లన్నీ చేసుకున్న తరువాత ఇదేంటంటూ నిలదీసిన యువతి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News