: లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు... మురిసిపోతున్న వృద్ధ దంపతులు!


సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా పరితపించిన ఆస్ట్రేలియాకు చెందిన 63 ఏళ్ల బామ్మగారి కోరిక నెరవేరింది. ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఒక విదేశీ దాత నుంచి స్వీకరించిన పిండం ద్వారా ఒక ఆడ పిల్లను ప్రసవించింది. ఆమె భర్తకు 78 ఏళ్లు. ఈ బిడ్డను చూసి వాళ్లిద్దరు మురిసిపోతున్నారు. ఈ వయసులో బిడ్డను కన్న రెండో వృద్ధ మహిళగా ఆమె రికార్డుల కెక్కింది. కాగా, 2005 లో 66 ఏళ్ల వయసులో ఆడపిల్లకు జన్మనిచ్చిన తొలి మహిళగా రొమేనియాకు చెందిన అడ్రియానా రికార్డులకెక్కింది. 2010లో 60 సంవత్సరాల వయసున్న ఆస్ట్రేలియా మహిళ రికార్డును తాజాగా అదే దేశానికి చెందిన 63 ఏళ్ల బామ్మగారు బ్రేక్ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News