: రూ.9,999 ల్యాప్ టాప్ ను విడుదల చేసిన కేటీఆర్
'ఆర్ డీపీ థిన్ బుక్' పేరుతో తయారు చేసిన చౌక ల్యాప్ టాప్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఈరోజు విడుదల చేశారు. ఐటీ హార్డ్ వేర్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఆర్ డీపీ వర్క్ స్టేషన్స్ తయారు చేసిన ఈ చౌక ల్యాప్ టాప్ ధర రూ.9,999. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సహకారంతో ఈ థిన్ బుక్ ను రూపొందించారు. దీని ప్రత్యేకతల విషయానికొస్తే... విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ ఆటమ్ ఎక్స్ 5-జడ్ 8300 ప్రాసెసర్, అల్ట్రా షార్ప్ హెచ్ డీ డిస్ ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్, మైక్రో హెచ్ డీఎంఐ, యూఎస్ బీ 2.0, యూఎస్ బీ 3.0, వీజీఏ కెమెరా, డ్యూయల్ హెచ్ డీ వంటి ఫీచర్లు ఉన్నాయి.