: కేసీఆర్ సర్కార్ ఏకపక్షంగా జీవోలు తీసుకువచ్చింది: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
తెలంగాణ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని కాదని ఉపయోగిస్తోన్న 123 జీవోను హైకోర్టు కొట్టివేయడంతో ప్రతిపక్షాలు కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు తీసుకువచ్చి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇప్పటికయినా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలని, 2013 భూసేకరణ చట్టానికి లోబడి ముందుకెళ్లాలని ఆయన సూచించారు. హైకోర్టు 123 జీవోను కొట్టివేయడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.