: ఈ తీర్పుతో ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయన్నది అవాస్తవమని తేలిపోయింది: టీ టీడీపీ


మల్లన్నసాగర్ భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 123 జీవోను హైకోర్టు కొట్టి వేయడంతో, ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్న తెలంగాణ ప్రభుత్వ వాదన అవాస్తవమని తేలిపోయిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాదులో టీడీపీ నేతలు మోత్కుపల్లి, వంటేరు, రావుల మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో మాత్రమే ప్రతిపక్షాలు ప్రజల తరపున పోరాడుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాలపై చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైందని వారు పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ద్వారానే రాష్ట్రంలో ఎక్కడైనా భూసేకరణ చేయాలని, జీవోలతో ప్రజలు, రైతులకు న్యాయం జరగదని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News