: తీర్పు కాపీ వచ్చాక స్పందిస్తా: హరీష్ రావు


మల్లన్నసాగర్ రైతులు 123 జీవోకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ పై వారికి అనుకూలంగా తీర్పు రావడంపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆచితూచి స్పందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 123 జీవో కొట్టివేతపై హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తరువాత స్పందిస్తానని అన్నారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సర్వసాధారణమని ఆయన తెలిపారు. దీనిపై ఆయన ఈ సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా స్పందించే అవకాశముందని సమాచారం.

  • Loading...

More Telugu News