: హైకోర్టు ఆదేశాలతో గాంధీభవన్‌లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ నేతలు
మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పక్షాన నిరసనలు తెలిపిన టీపీసీసీ నేతలు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరాలు జరుపుకుంటున్నారు. భూసేకరణ జీవో 123ను కొట్టివేసి, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు నుంచి ఈ ఆదేశాలు రాగానే కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బాణసంచా కాల్చారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ సర్కారుకి చెంపపెట్టు అని కాంగ్రెస్ నేతలు సర్కారుపై విమర్శలు గుప్పించారు.