: పైలట్ వార్నింగ్ తో ప్రయాణికుడి మద్యం మత్తు దిగింది
విమానంలో మూడు పెగ్గుల విస్కీ తాగి వీరంగం సృష్టించిన ఒక ప్రయాణికుడికి పైలట్ వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితులు సద్దుమణిగిన సంఘటన అమెరికాకు చెందిన ఎయిర్ లైన్స్ విమానంలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు... గత నెల 21వ తేదీన కెంటకీలోని లెక్సింగ్టన్ నుంచి నార్త్ కరోలినాలోని చార్లెట్క్ కు వెళుతున్న ఈ విమానంలో మైఖేల్ కెర్ అనే ప్రయాణికుడు కూడా ఉన్నాడు. మూడు పెగ్గుల విస్కీ తాగిన మైఖేల్ ను తన సీట్లో కూర్చోమని చెప్పిన ఫ్లయిట్ ఉద్యోగినితో అమర్యాదగా ప్రవర్తించాడు. తన సీట్లో కూర్చునే ప్రసక్తే లేదంటూ మొండికేశాడు. దీంతో, పైలట్ రంగంలోకి దిగాడు. పైలట్ ఎంత మర్యాదగా చెప్పినా మైఖేల్ తలకెక్కలేదు. ఇక లాభం లేదనుకున్న పైలట్, మైఖేల్ ను బలవంతంగా తీసుకువెళ్లి ఆ సీట్లో ఎత్తి కుదేశాడు. సీట్లో నుంచి కదలద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో నిషా దిగిన మైఖేల్ సైలెంటైపోయాడు.