: హైకోర్టు తీర్పు అమలు చేయకుండా ముందుకెళ్తే...పోరాటమే: రేవంత్ రెడ్డి
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 123 జీవోను కొట్టివేయడం ద్వారా ప్రభుత్వానికి హైకోర్టు తగిన గుణపాఠం చెప్పిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తప్పును హైకోర్టు సరిదిద్దిందని అన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే...తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు. న్యాయస్థానం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆయన తెలిపారు. అలా చేయని పక్షంలో తాము పోరాటానికి దిగుతామని ఆయన తెలిపారు.