: ఒబామా అంత చెత్త అధ్యక్షుడు అమెరికా చరిత్రలో లేడు: ట్రంప్


విమర్శలు సంధించడంలో తనను మించిన వారు లేరని అమెరికా అధ్యక్ష రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ సరైన అభ్యర్థి కాదని, రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా అభ్యర్థిని మార్చాలని ఒబామా సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అంత చెత్త అధ్యక్షుడు అమెరికా చరిత్రలో లేడని ఎద్దేవా చేశారు. ఒబామా అధ్యక్ష పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిల్లరీ క్లింటన్ ను ఆయన దెయ్యం అని పేర్కొన్నారు. డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన పోరులో ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ తో 'దెయ్యం' ఒప్పందం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతుండగా, తాజా సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ 9 శాతం ఆధిక్యం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News