: పాకిస్థాన్ బయలుదేరిన రాజ్‌నాథ్‌సింగ్
సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశంలో పాల్గొనడానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీ నుంచి పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రధానంగా 26/11 ఉగ్రదాడులు, పఠాన్‌కోట్ దాడుల గురించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ పర్యటనను నిరసిస్తూ పాకిస్థాన్‌లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాజ్‌నాథ్ పర్యటన నేపథ్యంలో ఆ దేశంలో ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.