: గొందిమళ్ల పుష్కర ఘాట్ లో పుష్కర స్నానం చేయనున్న కేసీఆర్


ఈ నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పుష్కర స్నానం చేయనున్నారు. పాలమూరు జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గొందిమళ్ల పుష్కరఘాట్ లో ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పుష్కర స్నానం చేయనున్నారు. పుష్కరాలు ప్రారంభం కావడానికి ముందు రోజే ఆయన అలంపూర్ చేరుకుని జోగుళాంబ సన్నిధిలోనే బస చేస్తారని సమాచారం. సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారిగా ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News