: జీఎస్‌టీ వ‌ల్ల రాష్ట్రాలు తమ హక్కులు కోల్పోతాయి: రాజ్యసభలో సీతారాం ఏచూరి


కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు రాజ్యసభలో ప్ర‌వేశ‌పెట్టిన‌ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుపై చర్చ కొన‌సాగుతోంది. ఈ సందర్భంగా సీపీఎం నేత సీతారాం ఏచూరి బిల్లుపై మాట్లాడుతూ.. జీఎస్‌టీ వ‌ల్ల రాష్ట్రాలు వ‌న‌రులు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటిని స‌ర్దుబాటు చేయడానికి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ప్ర‌శ్నించారు. ప్ర‌కృతి విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు కేంద్రంపైనే రాష్ట్రాలు ఆధారాప‌డాలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ బిల్లు పాస‌యితే రాష్ట్రాలు త‌మ హ‌క్కులు కోల్పోతాయ‌ని ఆయ‌న అన్నారు. దీనిపై రాష్ట్రాల‌కు కొంత‌ వెసులుబాటు ఇవ్వాల‌ని సూచించారు.

  • Loading...

More Telugu News