: నిలకడగా సోనియా ఆరోగ్యం... ఆర్మీ ఆసుపత్రి నుంచి గంగారామ్ ఆసుపత్రికి తరలింపు
నిన్న అనారోగ్యం బారిన పడి జ్వరం, వాంతులతో వారణాసి పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో చేరిన సోనియాను ఈ మధ్యాహ్నం సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. గతంలో ఈ గంగారాం ఆసుపత్రిలోనే ఆమెకు పలుమార్లు చికిత్స జరిగింది. ఆమె డీహైడ్రేషన్ తో పాటు జ్వరం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో సోనియాకు మరిన్ని పరీక్షలు చేయనున్నామని, సీనియర్ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వుందని పేర్కొన్నారు.