: ప్రపంచాన్ని గడగడలాడించిన నియంత హిట్లర్ ప్రియురాలికి 'ఐలవ్యూ' చెప్పలేకపోయాడట!
ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ నియంత హిట్లర్ తన ప్రియురాలికి ఐ లవ్యూ చెప్పలేకపోయాడంటే ఆశ్చర్యం కలగకమానదు. యూదులను గ్యాస్ చాంబర్లలోకి తోసి అత్యంత క్రూరంగా వ్యవహరించిన హిట్లర్ విద్యార్థిగా ఉండగా మంచి ప్రతిభావంతుడని అతని చరిత్ర చెబుతోంది. అభిరుచి రీత్యా పెయింటర్ అయిన హిట్లర్ ఖాళీ దొరికితే తనకు ఎంతో ఇష్టమైన డిస్నీ బొమ్మలు గీస్తుండేవాడట. అప్పట్లో ఓ యూదు యువతిని హిట్లర్ బాగా ఇష్టపడ్డాడట. కానీ ఆమెకు 'ఐ లవ్ యూ' చెప్పేందుకు భయపడ్డాడట. భయం అన్న పదానికి అర్థం తెలియని హిట్లర్ ఒక అమ్మాయి ముందు భయపడడం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ అది వాస్తవమని చరిత్రకారులు చెబుతున్నారు.