: తల్లి పుస్తకాల బ్యాగ్ జిప్ పెట్టలేదని... విద్యార్థి ఆత్మహత్య


తన పుస్తకాల బ్యాగ్ కు తల్లి జిప్ పెట్టకపోవడంతో కలత చెందిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన విశాఖపట్టణం జిల్లా రాయవరం మండలంలోని కోరుప్రోలు శివారు గెడ్డపాలెంలో నిన్న జరిగింది. ఆ గ్రామానికి చెందిన చల్లపల్లి రమణ కుమారుడు మోహన్ (13) పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమై, తన బ్యాగ్ కు జిప్ ను పెట్టమని తల్లి రామయ్యమ్మను కోరాడు. తాను ఖాళీగా లేనని, వేరే పనిమీద ఉన్నానని ఆమె చెప్పింది. బ్యాగ్ జిప్ ను అతన్నే పెట్టుకోమని కుమారుడికి చెప్పడంతో కలత చెందిన మోహన్ గదిలోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత ఇది గమనించిన విద్యార్థి తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే మోహన్ ను నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మోహన్ మృతి చెందాడు. ఒకే ఒక్క కొడుకు ఈ విధంగా చనిపోవడంతో మోహన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటనపై ఎస్.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News