: మోదీ కన్నా చంద్రబాబే సీనియర్: ఎమ్మెల్యే యరపతినేని
ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే సీనియర్ రాజకీయవేత్త అని ఆ పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఇన్నిసార్లు కేంద్రాన్ని సాయమడిగినా చేయకపోవడం చూస్తుంటే ఇందులో కుట్ర కోణం దాగి ఉందేమోననే అనుమానం కల్గుతోందన్నారు. ఏపీ విషయంలో కేంద్రం వైఖరిలో మార్పు రావాలని అన్నారు. దేవెగౌడ సమయంలోనే ప్రధాని అయ్యే అవకాశమొచ్చినా చంద్రబాబు వదులుకున్నారని, ఈ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని యరపతినేని అన్నారు.