: సెకండ్ చాన్స్... నేపాల్ కొత్త ప్రధానిగా ప్రచండ


అందరూ అనుకున్నట్టుగానే నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు నేత పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ ఎంపికయ్యారు. ప్రధానిగా ఆయన మద్దతు సాధించారని, పార్లమెంటులో జరిగిన ఓటింగ్ లో 50 శాతానికన్నా అధిక సభ్యుల మద్దతును ఆయన పొందారని ఒన్సారీ ఘార్తి మగార్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మొత్తం 573 మంది ప్రజా ప్రతినిధులు ఉన్న పార్లమెంటులో నేడు జరిగిన ఎన్నికకు 22 మంది గైర్హాజరు కాగా, 363 ఓట్లు ప్రచండకు వచ్చినట్టు ఒన్సారీ వెల్లడించారు. 210 మంది ప్రచండకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. గెలుపునకు 298 ఓట్లు అవసరం కాగా, అంతకన్నా మంచి మెజారిటీ ఆయనకు వచ్చిందని తెలిపారు. యునైటెడ్ డెమొక్రటిక్ మధేశీ ఫ్రంట్, ఫెడరల్ అలయన్స్ తదితర చిన్న పార్టీలను కలుపుకున్న నేపాలీ కాంగ్రెస్ కు ప్రచండ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నేపాల్ కు ప్రధానిగా ప్రచండ ఎంపిక కావడం ఇది రెండోసారి.

  • Loading...

More Telugu News